Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా కాక పేరుకుపోయిన బ్యాగులు
- బ్యాగులను భద్రపరుస్తున్న రైతులు
నవతెలంగాణ -రామన్నపేట
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే అమ్ముకునేందుకు రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కొన్న తర్వాత కూడా లోడు వేసేవరకు రైతులకు కష్టాలు తప్పడంలేదు. ధాన్యం కాంటా చేసిన తర్వాత లారీలు రాక ధాన్యం రవాణా కాకపోతే ధాన్యం బ్యాగుల బాధ్యత రైతులది నంటూ అధికారులు చెప్తున్నారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 2 వేల పైచిలుకు ధాన్యం బ్యాగులు రవాణా కాక నిలిచిపోయాయి. దీంతో సంబంధిత రైతులు బ్యాగుల పైన టార్ఫాలిన్ కవర్లు కప్పి భద్రపర్చుతున్నారు. ఇన్ని సంవత్సరాల వ్యవసాయంలో ఈసారి పడినంత వేదన మరెప్పుడూ పడలేదని రైతు బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తీసుకొచ్చి సుమారు రెండు నెలలు కావస్తోందని తెలిపారు. కాంటా అయిన తర్వాత కూడా లారీలు రాక నిలిచిపోయిన బ్యాగుల బాధ్యత మీదేనని రైతులను అధికారులు ఇబ్బంది పేడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు, అమ్మకాలలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి సరికొత్త ఆలోచన చేయాలని కోరుతున్నారు.