Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం ఉదయం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మండలకేంద్రానికి చెందిన బద్దం అంజిరెడ్డి, యమున్నమ్మ శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికే తాళం పగులకొట్టి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండటంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ జి.ఉదరు కిరణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. ఇంట్లో ఉన్న 16 తులాల వెండి ఆభరణాలు, రూ.400 నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.