Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ
వివాహిత అదృశ్యమైన ఘటన నల్లగొండ మండలంలోని ఆర్జాలబావి సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం..ఆర్జాలబావి సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో వల్లపుదాసు కల్పన దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం భర్త విజరుకుమార్ ఇంటికి భోజనానికి రాగా తాళం వేసి ఉంది. ఇంటి సమీపంలో ఉన్న వారిని వాకబు చేయగా నల్లగొండకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిందని సమాచారం ఇచ్చారు. ఎంత సేపటికీ రాకపోయే సరికి బంధువులకు ఫోన్ చేసినా ఎవరూ రాలేదని సమాధానం చెప్పారు. శుక్రవారం వరకూ చూసినా రాక పోవడంతో భర్త రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.