Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కరోనా లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. వేములపల్లి మండలానికి చెందిన 59 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.59,06,844 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, గడ్డం రాములమ్మ, వెంకన్న, సర్పంచులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, బత్తుల నాగలక్ష్మీ, దేశిరెడ్డి ఈశ్వర్రెడ్డి, చెరుకుపల్లి కృష్ణవేణి, అంకెపాల రాజు, అనిరెడ్డి నాగలక్ష్మీ, మజ్జిగపు పద్మ సుధాకర్, నాయకులు కృపాకర్రావు, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.