Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి కృషితో జిల్లాకేంద్రం మెడికల్‌హబ్‌గా మారిందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌లో జెకె హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.నిత్యం గ్రామాల నుండి ప్రజలు వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్నా రన్నారు. అందుకుగాను ప్రయివేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.స్థానిక వైద్యులు కలాం అహ్మద్‌ఖాన్, జబీనాభేగం ప్రాంతప్రజలకు సేవలందిం చడానికి మల్టీకేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినంద నీయమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్, టీఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, ఉప్పల ఆనంద్, గండూరి కృపాకర్, డీఎంహెచ్ఓ కోటాచలం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్,కౌన్సిలర్లు శ్రీనివాస్, గండూరి పావనికృపాకర్, సుంకరి రమేశ్,జ్యోతి,కర్నాకర్, వల్దాస్ జాని, సందీప్, రాచకొండ కృష్ణమూర్తి, శేఖర్ పాల్గొన్నారు.