Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులుచినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
ఆస్పత్రిలో పని చేసే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచేంత వరకూ సమ్మె విరమించేది లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని రెండు నెలలుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశం ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, పర్వతం రామయ్య, మునగ వెంకన్న, అంబటి కృష్ణ, వరికుప్పల నవీన్, చిన్న బొస్క నరేష్, నాగమణి, రేణుక, లక్ష్మి, రమాదేవి, జ్యోతి, లింగయ్య, నాగరాజు, సతీష్, వినోద్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.