Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలంలోని మహ్మదాపురం గ్రామ పరిధిలోని లాల్‌సింగ్‌తండాకు చెందిన అజ్మీరా రమేశ్, తన స్నేహితులు మక్కా గణేష్, ఆంగోతు నాగు, భూక్యా వాసు, బానోతు విజరులు కలిసి ఆంధ్రా ప్రాంతం విశాఖపట్నంలోని దారుకొండ గ్రామం నుండి ప్రభుత్వం నిషేధించిన గంజాయిని తరలిస్తుండగా పెన్‌పహాడ్ పోలీసుస్టేషన్ పరిధిలో పట్టుకొని 130 కిలోల గంజాయిని సీజ్ చేశారు.సూర్యాపేట డీఎస్పీ మోహన ్కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడిం చారు.ఇందులో ప్రధాన నిందితుడైన అజ్మీరా రమేశ్‌పై పీడీయాక్టు నమోదు చేశారు.గంజాయి కేసులతో సంబంధం ఉన్న 15 మందిపై గతంలోనే సస్పెక్ట్ షీట్స్ నమోదు చేశారు.అజ్మీరా రమేష్ మళ్ళీ ఇలాంటి నేరానికి పాల్పడద్దనే ఉద్దేశంతో అతనిపై పీడీయాక్టు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.