Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ పాలకవర్గం చెత్త సేకరణకు యూజర్ చార్జీలు వసూలు నిర్ణయాన్ని నిలిపివేయాలని సామాజిక కార్యకర్తలు పోడుగు హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పొడుగుహుస్సేన్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ప్రజానీకంపై చెత్త సేకరణకు వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌తో ముప్పై మూడు రకాల యూజర్ చార్జీలు నెలకు రూ.80 నుండి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేయడానికి ఉత్తర్వులు సిద్ధం చేయడం అన్యాయమన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, రాయపూడి వెంకటనారాయణ, కొల్లు వెంకటేశ్వరరావు, సంపేటఉపేందర్గౌడ్, మైసా రమేశ్, పైడిమర్రి వెంకటనారాయణ ఉన్నారు.