Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
జూలై 8న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి జయంతి రోజున (వైఎస్ఆర్టీపీ) వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆవిర్భావించబోతున్న సందర్భంగా హైదరాబాదులోని లోటస్పాండ్లో ముఖ్యనేతలతో సమావేశంలో పార్టీ విధి విధానాలు చర్చించారు.అనంతరం తెలంగాణలో పార్టీ బలోపేతానికి ముందుగా సన్నాహక కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట నియో జకవర్గం నుండి మండలకేంద్రానికి చెందిన ఎండి.రఫీకి చోటు దక్కింది.ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్షర్మిలమ్మ, పిట్ట రాంరెడ్డి, మతిన్, కొండ రాఘవరెడ్డి, ఇందిర శోభ, రాజగోపాల్ లకు కతజ్ఞతలు తెలిపారు.సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పిట్ట రాంరెడ్డితో కలిసి ముందుకుసాగుతానన్నారు.