Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ భాస్కరన్
నవతెలంగాణ-సూర్యాపేట
నకిలీ విత్తనాలు రైతులకు చేరుకుండా కృషి చేస్తున్నామని ఎస్పీ భాస్కరన్ అన్నారు.శనివారం మంత్రి నిరంజన్‌రెడ్డి డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ, నాణ్యత లేని విత్తనాలను రైతులకు అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో విత్తన దుకాణాలు, ఏజెంట్లు, సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నామన్నారు. గ్రామాలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి నకిలీవిత్తనాల ముఠాల గుట్టురట్టు చేసి రూ.కోట్ల విలువచేసే నకిలీ విత్తనాలు పట్టుకున్నామన్నారు. జిల్లాలో 3 కేసులు నమోదు చేసి 14 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.నిఘాను పటిష్టం చేసి తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.నకిలీ విత్తనాలు రైతులకు చేరకుండా కృషి చేశామని వివరించారు.ముందస్తు సమాచారం మేరకు అక్రమాలకు పాల్పడే, నకిలీ విత్తనాలు సరఫరా చేసే పలు సంస్థలు, ఏజెంట్ల కోసం, ముఠాల కోసం ప్రత్యేకబందాలు ఏర్పాటు చేశామని వివరిం చారు.ఈ కార్యక్రమంలో ఎస్బీడీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు రాజేష్, నర్సింహ, ఐటీసెల్ శివకుమార్, కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు.