Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
9 వారాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధికూలీల బకాయిలను వెంటనే విడుదల చేసి కూలీల ఆకలి తీర్చాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శని వారం ఆ సంఘం ఆధ్వర్యంలో చివ్వెంల మండల కమిటీ ఆధ్వర్యంలో తిరుమలగిరి, గుంపుల, వల్లభాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధిపనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.జిల్లావ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న 2,59,567 జాబ్ కలిగిన కుటుంబాలకు తొమ్మిది వారాల నుండి చేసిన పనికి వేతనాలు పెండింగ్ లో పెట్టడం వల్ల సుమారుగా 6,05,107 లక్షల మంది ఉపాధికూలీలు అర్ధాకలిలో అలమటిస్తున్నారన్నారు.కరోనా విజృంభణతో పనులు ఆగిన దగ్గర చట్టం ప్రకారపం జాబ్‌కార్డుదారులకు నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ చట్ట ప్రకారం వారం వారం పేమెంట్ చేయాలని ఉన్న డైరెక్షన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించాయన్నారు.పైగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గ్రూపుల జాబ్ కార్డులను సపరేట్గా డిజిటలైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేతనాలను దేశవ్యాప్తంగా పెండింగులో పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షులు కొల్లూరిబాబు, వివిధ గ్రామాల మేట్లు కోడిలక్ష్మమ్మ, మట్టపల్లిరేణుక, గొల్లగోపుల అనంతలక్ష్మీ, పందిరి నర్సిరెడ్డి, కంచర్ల ఉషమ్మ, చింతపల్లి సైదమ్మ, కొమ్మునాగమణి, బల్క ఎల్లయ్య, తాందారిపల్లి నాగయ్య, శేఖర్ పాల్గొన్నారు.