Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోటకొండూర్
మండల పరిధిలోని కదిరిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ - యమునలు ఇటీవల అనారోగ్యంతో మతి చెందారు. దీంతో వారి ముగ్గురు కుమార్తెలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ శనివారం పిల్లలను పరామర్శించారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్, వారి ఉన్నత చదువుల పూర్తి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు రూ.20 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల పాండు, ఈరగని శ్రీనివాస్, శ్రీనివాస్, ఫైళ్ల సత్యనారాయణరెడ్డి, తొండల సత్యనారాయణ, జేట్ట నరేందర్ తదితరులు పాల్గొన్నారు.