Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాలకులు తగు చర్యలు చేపట్టాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగానినాగన్నగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఐఎన్టీయూసీ అనుబంధ రాజీవ్‌గాంధీ ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మికులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి వారి సంక్షేమానికి పాటుపడాలన్నారు.కేజీ టు పీజీ ఉచిత విద్యను పకడ్బందీగా అమలు చేసి బాలకార్మికులకు విద్యతో పాటు వారి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించాలన్నారు.కరోనా విజంభణతో అనేక కుటుంబాల జీవనప్రమాణం దెబ్బతిని అనేకమంది పిల్లలు బాలకార్మికులుగా మారే ప్రమాదం దాపురించిందన్నారు.పాలకులు వెంటనే ప్రత్యక్షచర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రవీందర్, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు మేళచెరువు ముక్కంటి, నాయకులు రామ్మూర్తి, అచ్చమ్మ, శివపార్వతి, రాము, హరిబాబు, హబీబ్, హర్షిని, నాగేశ్వరరావు, మధుబాబు పాల్గొన్నారు.