Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
రైతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా రైతులందరినీ ఒకే దగ్గరకి సంఘటితం చేసేందుకు, వ్యవసాయ మెళకువలు తెలియచేయడానికి, శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ఒక వేదిక అవసరమని రైతు వేదికలను గ్రామాల్లో 5 వేల ఎకరాలకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంకా ప్రారంభించకపోవడం, ఏ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో వీటి పరిస్తితి కూడా ఉత్సవవిగ్రహాలుగా మారాయి.5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున పెన్‌పహాడ్ మండలాన్ని 5 క్లస్టర్లుగా విభజించి క్లస్టర్‌కు ఒక వేదిక చొప్పున మండలంలో 5 రైతు వేదికలను ఏర్పాటు చేశారు.దుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక పరిధిలోనికి దుపాడు, లింగాల, మాచారం రెవెన్యూ గ్రామాలు, చీదేళ్ళ గ్రామములొ ఏర్పాటు చేసిన రైతు వేదిక పరిధిలోనికి చీదేళ్ళ, గాజుల మల్కాపురం రెవెన్యూ గ్రామాలు,నాగులపాటి అన్నారంలో ఏర్పాటు చేసిన రైతువేదిక పరిధిలోనికి నాగులపాటిఅన్నారం, అనంతారం, పొట్లపాడు రెవెన్యూ గ్రామాలు, అనాజీపురం గ్రాముంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక పరిధిలోకికి అనాజీపురం, నాగులపహాడ్, దోసపహాడ్ రెవెన్యూ గ్రామాలు 5.పెన్ పహాడ్ లో ఏర్పాటు చేసిన రైతువేదిక పరిధిలోకి పెన్‌పహాడ్,సింగారెడ్డి పాలెం, మహ్మదాపురం, భక్తాలపురం, ధర్మాపురం, రెవెన్యూ గ్రామాల చొప్పున ఒక్కదానికి రూ.22 లక్షల చొప్పున రూ.1.10 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు.ఇంత ఖర్చు చేసి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి.రైతుల సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికలు వానాకాలం నాట్ల సీజన్ వస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకొలేదు. పంట వేసిన తర్వాత ఏ పంటలు వేయాలని ఎవరికి సలహాలు ఇస్తారో అర్దం కావడంలేదు. దీనిపై ప్రజలు, విశ్లేషకులు స్పందిస్తూ ఆలోచన గొప్పదే కానీ ఆచరణే లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.నాట్లు మొదలయ్యేలోపు రైతు వేదికలను ప్రారంభించి సరైన సూచనలు, ఏ పంటలు వేయాలని, వేసిన పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని రైతులు భావిస్తున్నారు.