Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్రంలో ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు
- ఎంపీ ఇచ్చిన పిలుపుపై జిలాల్లో భిన్నాభిప్రాయాలు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీర్వ దించారు.ఎంపీ తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కెేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం పొందారు.అంతకుముందు జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని కలిసి మంత్రి ఆశీర్వాదం కూడా పొందారు.ఎంపీకి మంత్రి శాలువా కప్పి మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.మంత్రితో పాటు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు,మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి,ఆదనపు కార్యదర్శి డీఎస్వీశర్మ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన ్పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితా ఆనంద్,టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్ కుమార్, ఉప్పల ఆనంద్ ఉన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో....
రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎంపీ నివాసంలో ఆయన కలిసి పూలబొకే అందజేసి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షులు,సావిత్రి భాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామిగౌడ్,సంఘ గౌరవ సలహాదారులు దేవత్ కిషన్‌నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్‌రెడ్డి, సహాయ కార్యదర్శి ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్,జిల్లా పాల సైదులు, బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్, సంఘం పట్టణ అధ్యక్షులు జలగం సత్యంగౌడ్,కడారి అంజయ్య,కొత్తపెళ్లి వెంకన్న,బానోతు జానీ నాయక్,పట్టణ గోపాల్ రెడ్డి, ఖమ్మంపాటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ పిలుపు పెడచెవిన..
కరోనా విజభిస్తున్న సమయంలో తన పుట్టినరోజుని ఎవరూ జరపవద్దని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వారం రోజుల కిందే స్వయంగా ప్రకటించారు.తన పుట్టినరోజు వేడుకలికి అయ్యే ఖర్చు కరోనా బాధితులకు వివిధ సేవా కార్యక్రమాలు ద్వారా అందజేయాలని పిలుపునిచ్చారు.అయినప్పటికీ జిల్లా,పట్టణ స్థాయి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర,జిల్లా,పట్టణ నాయకులు భారీ సంఖ్యలోనే ఎంపీ నివాసానికి చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అందునా ఈ వేడుకల్లో ఎంపీనే స్వయంగా పాల్గొనడంతో జిల్లాలో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఎంపీ తన పుట్టినరోజు వేడుకలు ఎవరూ నిర్వహించవద్దని చెప్పి తానే స్వయంగా పాల్గొనడం ఏమిటోనని గుసగుసలు వినవస్తున్నాయి. ఇందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన మాటను పెడచెవిన పెట్టడమేమిటని అని ధీర్ఘం తీస్తున్నారు. అయినప్పటికీ ఎంపీ ఇచ్చిన పిలుపు ప్రజల శ్రేయస్సు కోసమే అయినందున ఆ మాటని గౌరవిస్తే బాగుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఎంపీ పుట్టినరోజు వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగానే నిర్వహించారని చెప్పొచ్చు.