Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, చిరుమర్తి
నవతెలంగాణ- నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీలో పలు అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఈనెల 15 రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు రానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభివద్ధి కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో రూ. 80 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్మశాన వాటికను, రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి , తహసీల్దార్ శ్రీనివాస్, మునిసిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ ఎన్. బాలాజీ, పీఏసీఎస్ చైర్మెన్‌్ పాల్ రెడ్డి మహేందర్ రెడ్డి నాయకులు మాద నగేష్ గౌడ్, నడికుడి వెంకటేశ్వర్లు, గొర్ల వీరయ్య, నవీన్ రావు, చౌ గొని శంకర్, మురారి శెట్టి కష్ణమూర్తి పాల్గొన్నారు.