Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
పాముకాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బూరుగడ్డ గ్రామంలో శనివారం రాత్రి చోటచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బూరుగడ్డ గ్రామానికి చెందిన జానకిరాములు, శిరీషల కుమారుడు(8 నెలలు) ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసి వెళ్తుండగా చూశారు.వెంటనే పామును చంపివేశారు.చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియాస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారని, ఇక్కడ డ్యూటీ డాక్టర్ లేడని చెప్పారు.దీంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.అక్కడ కూడా వైద్యుడు కోదాడకు తీసుకోవాలని చెప్పడంతో పట్టణంలోని మరో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యులు కూడా కోదాడకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కోదాడలో ఆ హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.దీంతో ఖమ్మంకు తీసుకెళ్లారు.అప్పటికే రెండుగంటలు కావడంతో బాలుడు మృతి చెందాడు.హాజూర్నగర్ ఏరియాస్పత్రిలో పాముకాటుకు ఇంజెక్షన్ లేకపోవడంతో తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.