Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ
నవతెలంగాణ- నల్లగొండిపాంతీయ ప్రతినిధి
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 15న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో భాగంగా నకిరేకల్ మున్సిపల్ కేంద్రంలో రూ.80లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక, రైతువేదిక ప్రారంభం, కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో రైతువేదిక ప్రారంభిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కిరేకల్ కేంద్రంలోనే 100పడకల దవాఖానా భవన నిర్మాణానికి, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన, సూర్యాపేట పట్టణంలో పోస్ట్ఆఫీస్ నుంచి ఎస్వీ డిగ్రీ కాలేజీ వరకు రోడ్ వెడల్పు పనులకు ,ఇంకా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.