Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9,42,728 మంది రైతులు
- 22.69లక్షల ఎకరాలు
- సుమారు రూ.1200కోట్లు
జూన్ మొదటి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కూడా అనుకూలంగా నమోదయ్యాయి. రైతులు భూములను మొదటి దఫా దుక్కులు దున్ని విత్తనం విత్తేందుకు భూమిని సిద్ధం చేశారు. ఇక డబ్బులు చేతికొచ్చేదే ఆలస్యం .. విత్తనాలు కొనుగోలు చేసి వేయాల్సిందే.. అయితే ప్రతి ఏటా సీజన్ మొదలు కాగానే ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సొమ్మును రైతుకు అందించేందుకు చర్యలు సిద్ధం చేసింది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2262595 ఎకరాలలో వివిధ పంటల సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 600675 ఎకరాలు, నల్లగొండ 1215357, యాదాద్రి జిల్లాలో 446563 ఎకరాలలో సాగు చేయనున్నారు. ఇందులో పత్తి, వరి పంటలే ప్రధానంగా సాగు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి ఒక సీజన్‌కు రూ.5వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు అందిస్తుంది. అయితే ఏ సీజన్ సొమ్మును ఆ సీజన్‌కే రైతు వ్యక్తిగత ఖాతాలో జమచేస్తుంది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో 9,42,728 మంది రైతులకు 22.69లక్షల ఎకరాలకు సుమారు
రూ.1200కోట్లు ó అందిస్తుంది.
జిల్లా రైతులు ఎకరాలు పెట్టుబడి సొమ్ము
--------------------------------------------
సూర్యపేట 2.46లక్షలు 6.26లక్షలు రూ.313కోట్లు
యాదాద్రి 2,23,745 4.25లక్షలు రూ.212కోట్లు
నల్లగొండ 4,73,983 12.18లక్షలు రూ.608.18కోట్లు
---------------------------------------------
పంటరుణాల ప్రణాళిక ఏదీ...?
రైతులకు పంటల సాగు సీజన్ మొదలైతే రైతులకు ఎపుడు ఆర్థిక అవసరాల కోసం వెతుకులాట తప్పడంలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్టుబడి సొమ్ముగా కొంత సాయం చేసినప్పటికి ఆ సొమ్మే సాగుకు సరిపోయే పరిస్థితి లేదు. దుక్కులు దున్నకం, విత్తనాలు, ఏరువులు, కూలీలకు ధరలకు పెద్దఎత్తున పెరిగిపోవడంతో ఏ మాత్రం సరిపోవడంలేదు. అయితే పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు తమ రుణప్రణాళికను విడుదల చేయలేదు. ఒకవేళ రుణాలిస్తామని చెప్పినా... గతంలో బ్యాంకులలో అప్పులున్న వారికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఎందుకు పాత బకాయిలుంటే ఏ రైతుకు కూడ రుణం ఇచ్చే ప్రసక్తే లేదని పెర్కొంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ అంటేనే రైతులు బకాయిలు చెల్లించలేదు. నాలుగు దఫాలుగా బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఈసారి పెద్దఎత్తున రైతులకు రుణాలు వచ్చే అవకాశం లేదు. దాంతో ఈ సీజన్లో రైతులకు సాగు సమయంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఒకవేళ వడ్డీలు తెచ్చుకుందామని అనుకున్న అవి కూడా కరోనా కష్టకాలంలో పెద్దగా లేకుండా పోయాయి. ఎటొచ్చి అన్నదాతలకు కష్టంగానే ఉంది ఈసారి.
15వరకు రైతులంతా దృవీకరణ పత్రాలివ్వాలి
ధరమ్‌సోత్ రామరావునాయక్ వ్యవసాయశాఖ అధికారి , సూర్యాపేట
రైతుబంధు కోసం ఇంకా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వని రైతులు ఈనెల 15వరకు స్థానిక ఏఈవో, ఏవోలకు వెంటనే అందజేయాలి. రైతుబంధు సొమ్ము రైతులకు చెల్లించేందుకు పూర్తి ఏర్పాటు చేశారు. రేపటి నుంచి వ్యక్తిగత ఖాతాలో జమచేస్తారు.