Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు అంగీకారం
- వేతనాల సమస్య పై 23న జాయింట్ మీటింగ్
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ -నల్లగొండ
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం రాత్రి డీఎస్పీి వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంట్రాక్టర్ ,యూనియన్ ప్రతినిధులకు జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో పీఎఫ్ ,ఈఎస్ఐ నెలనెలా సక్రమంగా చెల్లించే విధంగా , కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వేతనంతో కూడిన సెలవు కోవిడ్ వార్డులో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అదనంగా మరో రెండు రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వడానికి అంగీకరించారు. వేతనాల పెంపుదలకు ఈ నెల 23న జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమస్యలన్నీ సమగ్రంగా చర్చించి పరిష్కారం దిశగా ప్రయత్నించాలని ఇరువురు రాతపూర్వకంగా అంగీకరించిన నేపథ్యంలో శనివారం రాత్రి తాత్కాలికంగా సమ్మె విరమించి ఆదివారం నుండి కార్మికులు విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించారు. 23 జాయింట్ మీటింగ్ జరుపుకొని వేతనాల పెంపుదల జరగకపోతే సమ్మె చేస్తామని ప్రకటించారు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే ప్రభుత్వం దష్టికి తీసుకు పోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జాయింట్ సమావేశంలో టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ నర్సిములుగౌడ్ కాంట్రాక్ట్ ప్రతినిధులు భరత్, సురేష్ కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున , జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ,జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ ,పర్వతం రామయ్య, మునుగా వెంకన్న అంబటి కష్ణ వరికుప్పాల నవీన్, నాగయ్య , నాగమణి రేణుక జ్యోతి అండాలు,నాగరాజు, వినోద్, సతీష్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.