Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కరోనాతో మతి చెందిన రాసాల మల్లేశ్ యాదవ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని, పిల్లలను చదివించేందుకు కషి చేస్తానని, గ్రామంలో కరోనాతో మతి చెందిన మరో ముగ్గురు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వడాయిగూడెంలో ఇటీవల మతి చెందిన పలు కుటుంబాలను జిల్లా గ్రంథాలయం చైర్మెన్ అమరేందర్ గౌడ్, సర్పంచ్ గుండు మనీష్ గౌడ్‌తో కలిసి పరామార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాతో నిరుపేద కుటుంబాలకు చెందిన చాలా మంది మతి చెందారని తెలిపారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక గ్రామంలో డయాలసిస్ తో బాధపడుతున్న కోట రాములు కుమార్తె వివాహానికి సాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, పీఏసీఎస్ చైర్మెన్ పరమేశ్వర్ రెడ్డి, టీియూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, ఉప సర్పంచ్ నీల పోశెట్టి, మాజీ ఉపసర్పంచ్ నీలా ఓం ప్రకాష్ గౌడ్,నాయకులు కళ్లెం కష్ణ, బబ్బూరి పోశెట్టి, సుక్కల శంకర్ యాదవ్, గోపాల్, దుర్గయ్య యాదవ్ పాల్గొన్నారు.