Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఎస్కే.ఉస్మాన్ షరీఫ్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు ఎస్కె.ఉస్మాన్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నిరసన తెలిపి విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే పత్రికా స్వేచ్ఛను హరించే దుర్మార్గమైన చర్య అన్నారు. ఆయన అక్రమ అరెస్టును ఖండించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. జర్నలిస్టులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వివరిస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులు , అరెస్టులను ఆపాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు పి.మట్టయ్య, గాదె రమేష్, కె.వివేక్, పాక జహంగీర్ ,ఏలాముల వెంకటేశ్, టి.మల్లేష్, డి.నాగచారి, పి.నరసింహ, చీర మహిపాల్, నాగరాజు రెడ్డి, ఎస్.స్వామి, ఎస్ శ్రీనివాస్ , ఎస్. శివలింగం, వి.అనిల్ , తిర్మల్ రెడ్డి పాల్గొన్నారు.