Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలపై అభియోగాలు చేయడం సరికాదని ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కేంద్రంలో రూ.కోటి నిధులతో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కొందరు అభివద్ధి నిరోధకులు మాత్రం దానిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విప్గొంగిడి సునీత మహేందర్రెడ్డ్డి అనివార్య కారణాల వల్ల అభివద్ధి కార్యక్రమాల ప్రారంభానికి హాజరు కాలేకపోయారని తెలిపారు . టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ పెద్దదిక్కుగా గొంగిడి మహేందర్ రెడ్డి హాజరయ్యారని స్థానిక కౌన్సిలర్లు తో అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయించారని వివరించారు. కొబ్బరికాయ కూడా ముట్టలేదని, కొట్టలేదని చెప్పారు .అనివార్య కారణాల వల్ల తోటి ప్రభుత్వవిప్ బాల్క సుమన్ తండ్రి సురేష్ సంస్థ చనిపోవడంతో మెట్పల్లి వద్ద గల వారి నివాసానికి వెళ్లి పరామర్శించారని తెలిపారు. మానవతా దక్పథంతో ఆరోపణలు చేసేవారు మసులుకోవాలని చెప్పారు. గొంగిడి దంపతులు చేస్తున్నటువంటి అభివద్ధిని చూసి ఓర్వలేక బురద చల్లుతున్నారన్నారు. 21 కోట్ల రూపాయలతో పట్టణ అభివద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. 3 కోట్ల రూపాయలతో చేపట్టిన సాయిబాబా గుడి దగ్గర నుంచి మార్కెట్ అవతల బైపాస్ వరకు బీటీ రోడ్డు పనులు, అన్ని వార్డుల్లోనూ సీసీి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు తొందర్లోనే పూర్తిచేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బేతి రాములు , రాయపురం నర్సింహులు, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మిప్రసాద్రెడ్డి, నాయకులు గంగుల శ్రీను, మొరిగడి వెంకటేష్ ,ఎర్ర దేవదానం ,మామిడాల భాను, కుండే సంపత్ , తదితరులు పాల్గొన్నారు.