Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
చైతన్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ చైతన్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారు ముందుకు వచ్చి సేవచేయడాన్ని అభినందించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలలో ఉండడం వల్ల వ్యాధి మరొకరికి వ్యాప్తించకుండా ఉంటుందన్నారు.విదేశాల్లో స్థిరపడి మాత భూమి మీద ప్రేమతో ఇక్కడ సేవ చేయాలనే ఆలోచన మంచిదన్నారు.అనంతరం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న సిబ్బందిని ఆయన సన్మానించారు.చైతన్య ఫౌండేషన్ చైర్మెన్ ఎన్ఆర్ఐ రవిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చింతా కవిత రెడ్డి,చుండూరు వెంకటేశ్వరరావు, నాయకులు బుర్ర పుల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ నెల్లూరు లీలావతి,ఎంపీటీసీ కష్ణవేణి,సొసైటీ చైర్మెన్ ఉషారాణి,చైతన్య ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.