Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఎజెండాలో ఎంపీ నిధులుపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్
మున్సిపాలిటీ ఎజెండాలో ఎంపీ నిధులుపెట్టడంపై ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యరతరం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం సోమవారం మున్సిపల్‌చైర్‌పర్సన్ గెల్లి అర్చన రవి అధ్యక్షతన నిర్వహించారు.సమావేశానికి హాజరైన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ నిధులు మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎమర్జెన్సీ పేరిట మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా కలెక్టర్ వినియోగించడం కౌన్సిల్అధికారాన్ని నాశనం చేయడమేన్నారు.హుజూర్నగర్ మున్సిపాలిటీ అభివద్ధికి తన వంతు అన్ని విధాలుగా సహకరిస్తామని, మున్సిపల్ స్థాయి నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి అభివద్ధికి రావాల్సిన నిధుల గురించి కషి చేస్తా మన్నారు.ప్రతినెలా క్రమం తప్పకుండా మున్సిపల్ సమావేశాలు నిర్వహించాలన్నారు.పట్టణపరిధిలో అర్థాంతరంగా ఆగిపోయిన నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు త్వరితగతిన పంపిణీ చేయాలన్నారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అభివద్ధికి పార్టీలకతీతంగా అందరి సహకారంతో అభివద్ధి చేస్తామని, ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీకి మంజూరు చేసిన రూ.25 కోట్ల అభివద్ధి పనులు,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ అభివద్ధి పనులను సమావేశంలో ఆమోదిం చామన్నారు.డంపింగ్ యార్డులు ,శ్మశాన వాటికలు, హరితహారం, పట్టణప్రగతి ఇంటిపథకాలతో మున్సిపాలిటీని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.రాష్ట్రంలోనే హుజూర్‌నగర్‌ను ఉత్తమ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు.మున్సిపాలిటీ,పట్టణ అభివద్ధికి అధికనిధులు వెచ్చించి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మున్సి పాలిటీ సిబ్బందితో దురుసుగా వ్యవహరించకుండా సామరస్యంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించు కోవాలన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివద్ధి సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మెన్ జక్కుల నాగేశ్వర్రావు, కమిషనర్ నరేష్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీయాక్ట్ పెట్టాలి
నియోజకవర్గం పరిధిలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి అరెస్టు చేయాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కేసులు పెట్టాల్సిన పోలీసులు నకిలీ విత్తనాలు వారిని కనీసం స్టేషన్లకు పిలిచి విచారణ చేయడం లేదని ఆరోపించారు.నకిలీ విత్తనాల అమ్మకంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని వేల రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెట్టి సరైన దిగుబడి రాక రైతులు అప్పులపాలై వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. వారి వెనక ఉన్న పెద్దమనుషుల బాగోతం కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హజూర్నగర్కు మిషన్‌భగీరథ నీళ్లు తీసుకొచ్చేందుకు కృషి చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, కస్తాల శ్రావణ్‌కుమార్, కోతి సంపత్‌రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.