Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సరుకు రవాణా చేసే లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని లారీ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, షేక్ చాంద్‌పాషా మాట్లాడుతూ సెకండ్‌వేవ్‌లో కరోనా మహమ్మారి విజంభించి సరుకు రవాణా రంగాన్ని అతలాకుతలం చేసిందన్నారు.రాబోయే రెండు క్వార్టర్ టాక్స్‌లు మాఫీ చేసి తమను ఆదుకోవాలని కోరారు.గతేడాది నుండి వాహనాలు నడవకపోయినా..ఇన్సూరెన్స్ లక్షలాది రూపాయలు కట్టి నష్టపోయామన్నారు.ఐఆర్డీఏ చైర్మెన్, ఫైనాన్స్ కంపెనీలతో ఒక సమావేశం నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని విభాగాల ఉన్నతాధికారులతో పోలీసు, పారిశుధ్య, సివిల్ సప్లై, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, రవాణా శాఖ, తదితర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.వినతిపత్రం అందజేసిన వారిలో ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసన్ రావు, సంయుక్త కార్యదర్శి సుధాకర్‌గౌడ్, కోశాధికారి భూపాల్ ఉన్నారు.