Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రవహించే నేటి పోరాటాలకు చేగువేరా స్పూర్తిని, చేగువేరాను స్మరించుకోవడమంటే పోరాటస్పూర్తిని ఎక్కుపెట్టి పోరాటానికి పాఠాలు నేర్పడమేనని, అటువంటి పేరు చేగువేరా అని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ అన్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా వివిధ చోట్ల మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చైతన్య ప్రవాహం చేగువేరా అని, తిరుగుబాటుపై చెదరని సంతకం చేగువేరా అన్నారు.దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు బావుటా చేగువేరానని, నేటి తరానికి విప్లవ నినాదం చేగువేరా అన్నారు. అంతిమంగా అసమానతలు, అన్యాయాల్లేని సమాజాన్ని ఆకాంక్షించిన ధిక్కారస్వరం చేగువేరా అని తెలిపారు. అలాంటి చేగువేరా స్ఫూర్తితో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలకు పోరాట స్ఫూర్తితో పాటు, ఆక్సిజన్ అందించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ''చే'' మొక్కలు నాటు అని పిలుపులో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో వివిధ చోట్ల మొక్కలు నాటామన్నారు.చే స్ఫూర్తి కొనసాగించాలంటే విశ్వ మానవ సంక్షేమ పోరాటాలను నేటి యువత కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పతాని శ్రీను, జిల్లా నాయకులు గూడ నాగేంద్ర ప్రసాద్, బాబునాయక్, నాగరాజు, రామలింగయ్య, శ్రీను పాల్గొన్నారు.