Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని వెలిమినేడు గ్రామంలో వర్షాకాలం వస్తే గ్రామస్థులకు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద తప్పని తిప్పలు. చిన్న జల్లుల వర్షానికే గ్రామస్తులు అండర్ పాస్ బ్రిడ్జి క్రింద నుండి పోవాలంటే వర్షం నీళ్లలో నుండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ స్తులు చెబుతున్నారు. జీఎంఆర్ యజమాన్యం వెలిమినేడు రోడ్డు దాటేందుకు అండర్ పాస్ బ్రిడ్జిని, వర్షం నీరు పోవడానికి సర్వీస్ రోడ్డు పక్కన అండర్ డ్రయినేజీ నిర్మాణం ఏర్పాటు చేసింది. ఒక్క రోజు వర్షం పడితే అండర్పాస్ బ్రిడ్జి కింద వారం రోజుల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఆ యొక్క నీటిని పక్కనే ఉన్న అండర్ డ్రయినేజీలో కలుపపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిఎంఆర్ వ్యవస్థ సర్వీస్ రోడ్డున ఉన్న అండర్ డ్రయినేజీ నిర్మాణం నిరుపయోగంగా ఉంచుతుండడంతో, ఎప్పుడో కురిసిన వర్షానికి అండర్ డ్రైనేజీ నిండిపోయి దుర్వాసన వస్తుందని, దోమలు అధికమవుతున్నాయి సీజనల్ వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీఎంఆర్ అధికారులు స్పందించి అండర్పాస్ బ్రిడ్జి కింద నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నీటిని తొలగించాలి :వెలిమినేడు ఉమ్మెంతల సంగప్ప
వర్షం వస్తే అండర్పాస్ బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉంటుంది. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే నీటిని తొలగించాలి. జీఎంఆర్ నిర్మించిన అండర్ డ్రయినేజీ ఎన్నో రోజుల నుండి నిండి పోయి దుర్వాసన వస్తుంది.సీజనల్ వ్యాధు లకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా జీఎంఆర్ అధికారులు స్పందించి అండర్పాస్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ లేకుండా చేయాలి.