Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
కరోనా సమయంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీ నరసింహ రెడ్డి, మోత్కూరు ఎంపీడీవో పి.మనోహర్ రెడ్డి, ఎస్సై జి.ఉదరు కిరణ్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక శారదా క్లినిక్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, జిల్లా యూత్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో 42 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మోత్కూర్ శాఖ చైర్మన్ కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు బీసు మత్స్యగిరి, ఏపిఐడిసి మాజీ డైరెక్టర్ కంచర్ల యదగిరిరెడ్డి, యూత్ విభాగం మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు సిరిగల శివ నవీన్, డైరెక్టర్లు పిల్లలమర్రి నవీన్ , అనిల్, ఇమ్రాన్, బయ్యని గిరి ,రెడ్ క్రాస్ ప్రతినిధులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, బద్దం నాగార్జున రెడ్డి , బాలెంల మధు పాల్గొన్నారు.