Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మార్వో మహేందర్ రెడ్డి కి వినతిపత్రం అంద జేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం, రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా నాయకులు ఇరిగి ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఆంజనేయులు, యువ మోర్చా మండల అధ్యక్షులు పెసర్ల హరీష్, తదితరులు పాల్గొన్నారు.