Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్ సోమవారం భువనగిరిలో శాలువాతో ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పండగలు గణతంత్ర దినోత్సవం,స్వాతంత్ర దినోత్సవం,తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ లో ఘనంగా నిర్వహించిన ఘనత అనితారామచంద్రన్ దే నని కొనియాడారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ పడిగెల రేణుక, ప్రదీప్, శ్యామ్, సిద్ధార్థ పాల్గొన్నారు.