Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు గ్రామీణ స్థాయిలో తయారు చేసిన ఉత్పత్తులకు లోకల్ టు గ్లోబల్ మార్కెటింగ్ సౌకర్యం బైర్సన్ సంస్థ ద్వారా కల్పించి అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు బైర్సన్ సంస్థ ద్వారా మార్కెటింగ్ అనుసంధాన కార్యక్రమంను జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ బైర్సన్ సంస్థ సహకారంతో మహిళా స్వయం సహాయక సంఘాల తయారు చేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతతో డిమాండ్,సరఫరాకు అనుగుణంగా లోకల్ టు గ్లోబల్ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి అమ్మకాలు చేస్తుందని అన్నారు. జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 62 తెలంగాణ ఎస్.హెచ్.జి సూపర్ మార్కెట్లు ప్రారంభించినట్టు ఈ సంవత్సరం అంతానికి 500 లు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైర్సన్ సంస్థ ఎండి.బైరి రెడ్డి, డైరెక్టర్ హరిత, అదనపు పీడీ సరస్వతి, డీపీఎంలు మోహన్ రెడ్డి,అరుణ్ కుమార్ లు , ఏపీఎంలు జీడి కల్లు, కష్ణ మూర్తి,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుపై సమీక్ష
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న సాగు నీటి ప్రాజెక్ట్‌ల కారణంగా నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపు పై సోమవారం కలేక్టరెట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు నష్ట పరిహారం పంపిణీ, ఆర్అండ్ ఆర్ పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, ఇరిగేషన్ ఎస్ఈ ఆనందం ,మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, నల్గొండ డీఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ గొపిరామ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు.