Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నసింహుని సన్నిధిలో ఎంవీ.రమణ
నవతెలంగాణ- యాదగిరి గుట్ట
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగురోడ్డు మీదుగా యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. ఉ.దయం7 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 8:30 కి .గుట్ట మీద కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గహానికి నేరుగా చేరుకుంటారు.అక్కడి నుండి కోండ పైకి వేళ్లి కవచ ముర్తులను దర్శించుకుంటారు. అనంతరం కొత్తగా పునర్నిర్మితం అవుతున్న ఆలయం ను సందర్శిస్తారు. ఉదయం అల్పాహారం. అనంతరం సౌలభ్యం మేరకు యాదాద్రి నుంచి తిరుగు ప్రయాణం లో ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్, యాదాద్రి టెంపుల్ సిటీ పరిశీలిస్తారు.ముందుగా అనుకున్నట్లు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీలు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతోపాటు యాదాద్రి పర్యటనకు రావడం లేదు.అందుకు బదులుగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు సీజేఐతోపాటు యాదగిరి గుట్ట పర్యటనలో పాల్గొంటారు.