Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సహకారం మర్చిపోలేను
- భూసేకరణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాను
- జిల్లా కలెక్టర్ బాధ్యతలను సంతప్తిగా నిర్వర్తించాను
- బదిలైన కలెక్టర్ అనితారామచంద్రన్
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో స్నేహపూర్వకంగా పని చేశానని ప్రజల సహకారం మర్చిపోలేనని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా విధుల నుండి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల, వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యోగ సిబ్బంది, మీడియా ఇచ్చిన సహకారం మర్చిపోలేనని తెలిపారు. సుదీర్ఘ కాలంగా ఈ జిల్లా కలెక్టర్ గా వీధులలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు చీఫ్ సెక్రెటరీ కి ఆమె కతజ్ఞతలు తెలిపారు. నూతన జిల్లాగా యాదాద్రి భువనగిరి ఏర్పడ్డ తర్వాత విధుల్లో చేరినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా యాదాద్రి దేవస్థానంకు భూసేకరణ, బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు, కాలువల కోసం, ఎయిమ్స్ ఏర్పాటుకు, ఇండిస్టియల్ పార్క్ ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేసినట్టు తెలిపారు. భూసేకరణ సందర్భంగా రైతులు ప్రజలతో మమేకమై వారికి అండగా నిలిచానన్నారు. నేషనల్ హైవే పనులు వేగవంతం చేశామన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థల సేకరణ చేశామన్నారు. రైతులకు, భూనిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి సమస్య పరిష్కారానికి కషి చేశానన్నారు. కొవిడ్ మొదటి దశ, రెండవ దశలో ప్రజారోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. హరితహారం, పట్టణ, పల్లె ప్రగతి, నిర్ధశించిన లక్ష్యాలను చేరుకోవడంలో సఫలం అయినట్లు తెలిపారు.
యాదాద్రిలో ఇండ్లు కూల్చి వేసేటప్పుడు మనస్సు కలచివేసింది
యాదాద్రి అభివద్ధిలో భాగంగా ప్రధాన రహదారితో పాటు ఇతర అభివద్ధి పనుల్లో భాగంగా ఇండ్లు కూల్చివేయడానికి ప్రజలు వివరిస్తున్న మాటలు విని వెళ్లినప్పుడు మనసు కలిచివేసింది అన్నారు. రెండు మూడు రోజుల్లో ఆ బాధ నుండి తేరుకోలేకపోయానని తెలిపారు. సుమారు 40 నుండి 60 ఏండ్లుగా నివాసం ఉంటున్నామని ఇక్కడ నుండి వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్తాం అని వారు ససేమిరా అన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దష్టికి తీసుకు పోయినట్టు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించి వారితో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు అన్ని విధాలా నష్ట పరిహారం అందించడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సమస్య పరిష్కారం దొరికిందన్నారు.