Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నల్లగొండ ఐసోలేషన్ కేంద్రం
నవతెలంగాణ -నల్లగొండ
జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) అధ్వర్యంలో నడుస్తున్న మాళి పురుషోత్తం రెడ్డి కరోన ఐసోలేషన్ కేంద్రం ప్రజలకు బాసటగా నిలిచిందీ. గత వారం రోజులుగా 10 మంది కోవీడ్ బాధితులకు వైద్యం, ఆహారం అందిస్త్షు ఆహ్లాదకరంగా వుండేందుకు మంచి వసతి కల్పిస్తోంది. ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు , ఇద్దరు ఆయాలు, ఇద్దరు కుకింగ్ , ఒక వాచ్మెన్తో కేంద్రం నడుస్తోంది. ఒక కోవిడ్ బాధితునికి ఆక్సిజన్లెవల్ తగ్గగా దగ్గరుండి రాత్రి 9 గంటలకు నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ చేసి ఆక్సిజన్ వైద్యం అందించారు. రోజు విధిగా దగ్గరుండి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ,పట్టణ కార్యదర్శి ఎండి.సలీం,జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం ,పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య బాద్యులుగా వుండి కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు. సోమవారం కోవిడ్ ఐసోలేషన్ వార్డును వారు పరిశీలించి బాదితుల బాగోగులు తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఎన్ని రోజులైనా ఐసోలేషన్ కేంద్రాన్ని కొనసాగిస్తామని తెలిపారు. దాతలు, శ్రేయోభిలాషుల సహకారం అందిస్తున్నారని వారందరికి ధన్యవాదాలు తెలిపారు.