Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(రెం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - ఆలేరుటౌన్
అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ఉద్ధతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎలుగల బాలయ్య సంతాప సభ ఏసీ రెడ్డి భవనంలో పట్టణ కార్యదర్శి ఎంఎ.ఎక్బాల్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పీడిత వర్గాల ప్రజలు సాగించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బాలయ్య కమ్యూనిస్టుగా మారి ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. తాను బతికి ఉన్నంతకాలం సమాజంలో దోపిడీకి గురవుతున్న ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించారన్నారు. విద్యార్థి ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చి తన తుది శ్వాస వరకు కమ్యూనిస్టుగా జీవించిన బాలయ్య జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమన్నారు.
బీజేపీ విధానాలవల్లే దేశంలో కరోనా విజంభణ
బీజేపీ విధానాలవల్లే దేశంలో కరోనా వైరస్ విజంభణ కొనసాగుతుందని సీపీఐ(ఎం ) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. బాలయ్య సంతాప సభ అనంతరం ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైద్యం కుంటుపడిందని అన్నారు. కేవలం ఒక వెంటిలేటర్ మాత్రమే జిల్లాలో నేడు ఉన్న పరిస్థితి నెలకొందన్నారు. డెల్టా వైరస్ ప్రవేశించిందని ప్రమాదకరమని మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొన్నప్పటికీ కేంద్రం మొద్దునిద్రలో ఉందన్నారు. డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్‌కు డెల్టా అని నామకరణం చేసిందన్నారు. వైరస్ ప్రబలుతున్నప్పటికి కుంభమేళాలు ఎన్నికలు కేంద్రప్రభుత్వం నిర్వహించిందన్నారు. దీంతో మరణాల సంఖ్య అధికమైందన్నారు వైరస్ బాధితులు ఎక్కువ అయ్యారన్నారు. ఒకేరోజు ప్రధాని నరేంద్రమోదీ దిగిపోవాలని 14 కోట్ల మంది ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు , మండల కార్యదర్శి మొరిగాడి రమేష్, సీనియర్ నాయకులు పీఏసీఎస్ మాజీ చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్ ,వడ్డెమాను శ్రీనివాసులు, తాళ్లపల్లి గణేష, మోరిగాడి మహేష్, మోరిగాడి అజరు ,ఘన గాని మల్లేష్, ఆవాజ్ నాయకులు ఎండి లతీఫ్ ,మోడీగాడి విజరు, చెన్నా రాజేష్, భువనగిరి గణేష్ కాసుల నరేష్, మోరిగాడి అశోక్, గజ్జల నర్సింహులు, మోరిగాడి అంజనేయులు,తీగల వేంకటేశు ,మధ్య బోయిన ఉప్పలయ్య, సంఘీ రాజు , తదితరులు పాల్గొన్నారు.