Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీ అభివద్ధిపై ప్రత్యేక చర్యలు
- నూతన కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా హరితహారంలో భాగంగా పచ్చదనంతో కషి చేస్తానని నూతనంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ బంగ్లాలో బదిలీ అయిన కలెక్టర్ అనితారామచంద్రన్ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనితారామచంద్రన్ నుండి బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పనులు నిర్వహిస్తున్న జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ జిల్లాపై ఉందన్నారు. యాదాద్రి దేవస్థానం, బసాపురం రిజర్వాయర్, ఎయిమ్స్, లాంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ పనులలో ఎలాంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వర్తించిన అనితారామచంద్రన్ మేడం తను పనిచేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి జిల్లాలో ఒక సంవత్సరం పని చేయడమే కష్టసాధ్యమైన పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసి అధికారుల మెప్పు పొంది, సుదీర్ఘ అనుభవం ఉన్న అనితారామచంద్రన్ తనకు ఆదర్శమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పట్టణ పల్లె ప్రగతి కోసం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను లక్షణాలను సాధించడానికి కషి చేస్తామన్నారు. దీంతో జిల్లా అభివద్ధి వైపు ప్రయాణిస్తుందని ఆకాంక్షించారు. కార్పొరేషన్ల పని చేస్తా అనుభవంతో ఆరు మున్సిపాలిటీలను కమిషనర్ల కోఆర్డినేటర్‌తో అభివద్ధి చేయడానికి కషి చేస్తానన్నారు. అక్కడ విజయవంతమైన పథకాలను ఇక్కడ అమలు పరచడానికి కషి చేస్తానని తెలిపారు. తన మొదటి పోస్టింగు ఐటీడీసీ అని గిరిజనుల సమస్యలు ముఖ్యంగా మైదాన గిరిజనుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ముందుకు వెళ్తానన్నారు. రాష్ట్రంలో ధరణి తో రెవెన్యూ సమస్యల రూపురేఖలు మారాయని తెలిపారు. జిల్లా స్థాయి అధికారుల, ప్రజల సహకారంతో ప్రభుత్వం తనకు కల్పించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ సత్పతి తెలిపారు.