Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్మెన్ బండా నరేందర్ రెడ్డి
నవతెలంగాణ -నార్కట్పల్లి
నాటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ నాడు వ్యవసాయం దండగా. నేడు తెలంగాణలో రైతుబంధు 24 గంటల కరెంటు రైతు బీమా లతో వ్యవసాయం పండుగలాగా మారిందని జెడ్పీచైర్మెన్్ బండా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నెమ్మాని గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. మండలంలో వివిధ గ్రామాల్లో సుమారు రూ.71.96 లక్షలతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవం ,శంకుస్థాపన చేశారు. వైకుంఠ ధామం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 12.60 లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జెడ్పీజీఎఫ్ నిధులు రూ.12 లక్షలు అదనపు తరగతి గదులు, 2.50 లక్షలు. లతో కిచెన్ షెడ్డు నిర్మాణం ప్రారంభోత్సవం చేశారు. తొండ్లాయి గ్రామంలో 11 కే వి లైన్ మార్చుట జెడ్పీజీఎఫ్ నిధులు 4.86 లక్షలు, సీసీరొడ్డు , డీఎంఎస్టీ నిధులు 10 లక్షలు. శంకుస్థాపన చేశారు బాజకుంట గ్రామంలొ నూతన పైప్ లైన్ పొడగింపు , కనెక్షన్ జిల్లా పరిషత్ సహజ నిధులు రూ.3 లక్షలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రైతు వేధికలను వేధికగా చేసుకొని విస్తతంగా చర్చించకొని వివిధ రకాల లాభదాయక పంటలను ఎంపిక చేసుకొని నియంత్రిత సాగు చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రైతులు ఒకేవిధమైన పంటలను వేయకుండా అధిక లాభదాయకమైన పంటను వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి ,రైతు బందు మండల అధ్యక్షుడు యానాల అశోక్ రెడ్డి , పీఏసీఎస్ చైర్మెన్ కసిరెడ్డి మధుసుధన్ రెడ్డి , ఎంపీటీసీలు చింత దేవకమ్మ మేకల రాజి రెడ్డి పుల్లెంల ముత్తయ్య ,సర్పంచులు గంట్ల నర్సిరెడ్డి ,బింగి కొండయ్య, సరిత రవీందర్ రెడ్డి ఎంపీడీవో సాంబశివరావు , మండల వ్యవసాయాధికారి ఎర్రవల్లి గిరి ప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నర్సింహ, మాజీ సర్పంచులు చింత ప్రమీల కుషాల్ రెడ్డి ,మండల,గ్రామ నాయకులు పాల్గొన్నారు.