Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అదనపు సంచాలకులు ఐలయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం రెండేండ్లుగా అర్ధాంతరంగా నిలిపివేశారని విమర్శించారు. రండో విడత గొర్రెల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల గొర్రెల కోసం ఇతర జిల్లాలకు వెళ్లలేని స్థితిలో గొర్రెల కాపరులు ఉన్నందున గొర్రెల పంపిణీలో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల్లో ఖాతాలో నగదు జమ చేసి గొల్ల కురుమలు నచ్చిన చోట మెచ్చిన గొర్రెల కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ్మ,జిల్లా కమిటీ సభ్యులు వెల్లంల వెంకటేష్,తెల్జూరి మల్లేష్,కడారి రాజమల్లు, బాలకిషన్, పాల్గొన్నారు.