Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ - నూతనకల్
పేదలను ఆదుకునేది కాంగ్రెస్సేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐఎల్ఆర్ ఫంక్షన్హాల్లో నిరు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజారోగ్యమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న కరోనా ఫ్రంట్ వారియర్స్, కరోనా బాధిత కుటుంబాలు, కరోనాతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కరోనా బారినపడిన ప్రతి కుటుంబాన్నీ తమ పార్టీ ఆదుకుంటామన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన కుటుంబాలను ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటుంటే సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కరోనా బారిన పడిన ప్రతి కుటుంబానికీ రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అనంతరం సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి ల కూతురు తీగల వనన్యారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జెన్నారెడ్డి, వివేక్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, తుంగతుర్తి ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, మండల అధ్యక్షులు నాగం సుధాకర్‌రెడ్డి, సర్పంచులు తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి, గుర్రం సత్యనారాయణ, మరాఠీ రామస్వామి తదితరులు పాల్గొన్నారు