Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల వైద్యాధికారి నాగునాయక్ కోరారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని రామన్నగూడెం, బండరామారం గ్రామాల్లో 273 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ సందర్భంగా వారికి వైద్యాధికారి నాగునాయక్ మెడిసిన్ కిట్లు అందజేశారు. పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవోలు సముద్రాల సూరి, పాశం గోవిందరెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమన్న, నర్సింహాచారి, యాదగిరి, ఏఎన్ఎం భారతి, రూప, బండరామారం సర్పంచ్ ఉప్పునూతల ప్రణీత జేసీరెడ్డి, ఉప సర్పంచ్ పులుసు మంజులఉప్పలయ్య, రామన్నగూడెం సర్పంచ్ గుగులోత్ కాంతమ్మరాములు, ఎంపీటీసీ ఆంబోతు నరేష్నాయక్, కార్యదర్శులు ఎనగందుల వెంకటలక్ష్మి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.