Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తైన వాటిని వినియోగంలోకి తీసుకురావాలి
- జిల్లా అధికారులు హెడ్క్వార్టర్లోనే ఉండాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. మంగళవారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మండల అభివద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి పల్లె ,పట్టణ ప్రకతి వనాలు, హరితహారం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. డంపింగ్ యార్డులు శ్మశానవాటికలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందున ఈ నెలాఖరులోగా విధిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్లోనే ఉండాలని, తద్వారా 50 శాతం మేర అభివద్ధి పనులను సకాలంలో పూర్తి చేయగలమని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలలో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలను హరితహారానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి చేసిన డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవాలన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాలలో పనికిరాని పాడైపోయిన నీరుపయోగంగా ఉన్న బోరు బావులు, ఓపెన్ బోర్లు సంబంధితలకు నోటీసులు జారీ చేస్తూ వారం లోగా పూడ్చి వేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతంలో సమీకత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల కోసం ఏర్పాటు కోసం ఇప్పటికే నిధులు మంజూరైనందున ప్రాధాన్యతనిచ్చి చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, జెడ్పీ సీఈఓ కష్ణారెడ్డి పాల్గొన్నారు.