Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అక్రమార్కుల చేతుల్లో భూమి
నవతెలంగాణ -వలిగొండ
మండల కేంద్రంలో సర్వేనెంబర్ 29లో కోట్లు విలువ చేసే మూడెకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అక్రమార్కులు కబ్జాకు చేశారు. సర్వే చేయించి భూమిని కాపాడాలని ప్రజలు ప్రజా సంఘాలు వినతి పత్రాలు అందజేసినా, ధర్నాలు నిర్వహించినా సంబంధిత అధికారులు స్పందించలేదు. ా ఫిబ్రవరి నెలలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎంపీటీసీ-1 పాలుచం రమేష్ స్థానిక సర్పంచ్ బోళ్ల లలిత ప్రభుత్వ భూమిని సర్వే చేయించి హద్దురాళ్లు నాటించాలని పలుసార్లుకోరినప్పటికీ సంబంధిత అధికారి స్పందించడం లేదని ఎంపీపీ నుంచి రమేష్‌ను అడిగారు. అదే సమావేశంలో ఉన్న తహసీల్దార్ నాగలక్ష్మిని భవిష్యత్తులో జరిగే జనరల్ బాడీ సమావేశానికి సంబంధిత భూమిని సర్వే చేయించి హద్దులు నాటించి గొడవలు ముగించాలని ఆదేశించారు. వంద రోజులు దాటినా ఇప్పటికీ సంబంధిత ప్రజాప్రతినిధుల మాటలు పట్టించుకోవడం లేదు. వాస్తవంగా ప్రభుత్వ భూమి లెక్కల ప్రకారం 12 ఎకరాల 24 గంటలు ఉండాలి. ప్రభుత్వ భూమి 29 సర్వేనెంబర్ చుట్టూ 27, 28, 91, 37, 38 పట్టా భూములు ఉన్నాయి. సర్వే చేయించి చుట్టూ కొలత నిర్వహించి హద్దులు నాటాలని ఆదేశించిన వంద రోజుల తర్వాత డిప్యూటీ సర్వే ద్వారా కేవలం 27, 28 పట్టా భూములు సర్వే చేయించి చేతులు దులుపుకున్నారు. మిగతా సర్వే నెంబర్లు సర్వే చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడంతో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. మిగతా సర్వే నెంబర్లలో సర్వే చేయకపోవడంతో పలు అనుమానాలకు దారి తీసింది. ఇటీవల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు నాటించాలని ధర్నా నిర్వహించినా ఫలితంలేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమిని సర్వే నిర్వహించాలి
వలిగొండ సర్పంచ్ లలిత
మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ భూమి 29 సర్వే నెంబర్లు సర్వే నిర్వహించి హద్దులు నాటాలని గత ఫిబ్రవరి నెలలో మండల జనరల్ బాడీ సమావేశంలో తహసీల్దార్‌ను, ఎంపీపీ నూతి రమేష్ కోరాం. ఇప్పటివరకు నిర్వహించకపోవడంతో మళ్లీ నిర్వహించాలని కోరుతాను.
ఫోన్ చేసినా అందుబాటులో లేని తహసీల్దార్
ప్రభుత్వ భూమి 29 సర్వే నెంబర్ సర్వే నిర్వహించి హద్దులు నాటాలని ప్రజలు ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు తహసీల్దార్నుకోరినప్పటికీ సర్వే సంపూర్ణంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంపై నవ తెలంగాణ ఫోన్లో సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు .