Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీవో 60 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం స్కీం లో పనిచేస్తున్న ఆశా నుండి ఆఫీసర్ వరకు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం టీఆర్ఎస్కేవీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొంపల్లి మత్స్యగిరి డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మంగళవారం లైన్ వాడ అర్బన్ హెల్త్ సెంటర్ ఎదుట భోజన విరామ సమయంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ మిషన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని , వైద్య సిబ్బంది కుటుంబాలకు కోవిడ్ టీకాలు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని, కోవిడ్ తో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ.కోటి ఎక్సిగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూజిల్లా కమిటీ సభ్యులు పోలీస్ సత్యనారాయణ వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పందిరి మల్లేశం, నరం శెట్టి శ్రీనివాస్ ముప్పిడి జాని, సువార్త అమ్మ రేణుక పద్మ భాగ్య సకీనా పఠాన్, ధనలక్ష్మి వినోద సుజాత రేణుక శోభారాణి తదితరులు పాల్గొన్నారు.