Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ప్రభుత్వాస్పత్రికి అధికంగా రోగులు వస్తున్నారని ఆస్పత్రి గేటుకు తాళం వేయడంతో ఆస్పత్రి ముందు రోగుల నిరీక్షించిన చెందిన సంఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని లైన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లాల్లో రోగుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది .ఈ కేంద్రాల్లో ఉదయం 8గంటల నుండి రాత్రి8 గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందించాలి. ఈ కేంద్రానికి ప్రభుత్వ వైద్యాధికారి లేకపోవడంతో అధికారులు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యాధికారిణి కాంట్రాక్ట్ బేసిక్ గా నియమించింది. వైద్యాధికారి సమయపాలన లేకుండా ఆస్పత్రిలో ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాస్పత్రిని ప్రైవేట్ ఆస్పత్రిగా మార్చిందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో మధ్యాహ్నం సమయంలో రోగులను బయటకు పంపించి గేటుకు తాళం వేస్తున్నారని స్థానిక రోగులు పేర్కొన్నారు .
వైద్యాధికారి వివరణ :పై విషయంపై నవ తెలంగాణ వైద్యాధికారిణి వివరణ కోరగా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి.పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో రాయండి అంటూ సమాధానం చెప్పారు .