Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
అంగన్వాడీలకు 11వ పీఆర్సీని వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌కు, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 22న అసెంబ్లీ సాక్షిగా పీఆర్సీని అంగన్వాడీలకు కూడా వర్తింపజేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈనెల 11న ప్రభుత్వం జారీ చేసిన 11వ పీఆర్సీ నివేదిక ఉత్తర్వుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ టీచర్ల ప్రస్తావనే లేదన్నారు. దీంతో అంగన్వాడీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలువేరు రమాకుమారి, సుజాత, శ్యామల, లక్ష్మి, భాగ్యలక్ష్మి ఉన్నారు.