Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణను మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కలిశారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ స్పెషల్ లీవ్ పిటిషన్ ను త్వరితగతిన పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట యూటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు పాలకుర్తి కష్ణమూర్తి తదితరులు ఉన్నారు .
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు
భువనగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణ యాదాద్రికి విచ్చేసిన సందర్భంగా భువనగిరికి చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోదా వెంకటేశ్వర్లు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వంగేటి విజయ భాస్కర్ రెడ్డి, బబ్బురి హరినాథ్ గౌడ్, శ్రీహరి పాల్గొన్నారు.