Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరిరూరల్ : మండలంలోని బస్వాపురం గ్రామంలో 8 మంది గ్రామస్తులకు ఎమ్మెల్యే పైళ్లశేఖర్రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామియాదవ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కస్తూరి మంజుల శ్రీశైలం, ఉప సర్పంచ్ మచ్చ కరుణ తిరుపతి, ఎనబోయిన జహంగీర్ , దుర్గపతి చంద్రమ్మ, రసాల శ్రీశైలం, కస్తూరి పాండు, ఉడుత రామచంద్రయ్య, వార్డు సభ్యులు మచ్చ బిక్షపతి, ఉడుత సాయి ,రసాల కష్ణ, ఉడుత గణేష్ పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రానికి చెందిన దొమ్మాటి నాగరాజుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు పందుల పవిత్ర శ్రీను , పొలగోని ప్రకాష్ గౌడ,్ వార్డు సభ్యులు మిర్యాల మధుకర్ , నియోజకవర్గ నాయకులు మేకల ప్రమోద్ రెడ్డి , అయితగొని విజరు కుమార్ , మునుగోటి సాయి పాల్గొన్నారు.