Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
దేశం రక్షణ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందాడని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పసునూరి వీరేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో సంతోష్ బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు సముద్రాల కుమార్, పట్టణ అధ్యక్షులు అయిత వెంకటేష్ , యాదాద్రి భోవనగిరి జిల్లా ఆర్యవైశ్య సేవాదళ్ కమిటీ అధ్యక్షులు ఐడియా శ్రీనివాస్ , జిల్లా నాయకులు సముద్రాల సత్యం చోలేటి ప్రకాష్ తాటికొండ ఉపేందర్ ,గందె అంజయ్య పాల్గొన్నారు.
మోత్కూర్: మోత్కూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు సోమ వెంకటేశ్వర్లు, మండల, పట్టణ అధ్యక్షులు ఇరుకుల్ల వెంకన్న, మొగుళ్లపల్లి సోమయ్య,ఉపాధ్యక్షుడు వీరవెల్లి ప్రవీణ్ కుమార్, నాయకులు బుక్క విశ్వనాథం, గౌరు శ్రీనివాస్, గౌరు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.