Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నున్నా
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
సీపీఐ(ఎం) పర్యవేక్షణలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి క్యాంపు కార్యాలయంలో గల నిర్మల హదరు హైస్కూల్లో నిర్వహిస్తున్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు మంగళవారం పలువురు దాతలు 51 వేలు నగదు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై వేల రూపాయలను అందజేశారు. ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బత్తినేని వెంకటేశ్వరరావు చొరవతో తన స్నేహితుల ద్వారా ఇరవై ఆరు వేల రూపాయలను అందించడం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన సాధినేని వెంకటేశ్వరరావు ఐదు వేల రూపాయలు, చిమ్మపుడి ఫౌండేషన్ అధినేత చిమ్మపుడి రామ్మూర్తి రూ.5వేలు, బోడేపూడి అప్పారావు పది వేల రూపాయలు, ఖమ్మం నగరానికి చెందిన ఇరుకులపాటి పిచ్చయ్య-జయమ్మ దంపతులు ఆరు వేల రూపాయలు ఐసోలేషన్ సెంటర్కు ఇవ్వడం జరిగింది. ఖమ్మం నగరానికి చెందిన ఎస్.కే మతిన్ ఐదు వేల రూపాయలు, అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐసోలేషన్ సెంటర్కు నగదు వితరణ చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలువురు సహృదయంతో స్పందించి నగదు, నిత్యావసర వస్తువులు దానం చేయడం ద్వారా ఐసోలేషన్ సెంటర్ను నలభై రోజులుగా దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నమన్నారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి నగదు, నిత్యావసర వస్తువులు దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, సిపిఎం సీనియర్ నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, అల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ రాష్ట్ర కార్యదర్శి మచ్చా రంగయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపిచంద్, కళ్యాణం నాగేశ్వరరావు, డివైయఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, బివికే జనరల్ మేనేజర్ వైయస్సార్, బివికే నిర్వాహకులు రామారావు, వెంకట్రావు, వీరభద్రం, తల్లంపాడు సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి పల్లె శ్రీనివాసరావు, కూరపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.